ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మాట్లాడుతూ..ఎవరికైనా సాయం చేసే స్థాయికి నా దగ్గర డబ్బుంది. ఇదే నాకు దక్కిన ఆశీర్వాదం అనుకుంటున్నా అన్నారు సాయి పల్లవి. సాయి పల్లవి ఆస్తుల విలువ దాదాపు 47 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇలా తనకు మరింత ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉన్న ఎప్పటికీ కూడా తన విలువలను వదిలిపెట్టనని సాయి పల్లవి భీష్మించుకొని కూర్చున్నారు. తాను ఒక సినిమాకు కమిట్ అవుతున్నారు అంటే అందులో ఎలాంటి గ్లామర్ షో ఉండదు..
అలాగే ఆ సినిమాలో తన పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటే తప్ప ఆమె కమిట్ అవ్వరు. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే స్టార్ హీరో అయిన కోట్లలో రెమ్యూనరేషన్ అయిన సాయి పల్లవి నిర్మొహమాటంగా సినిమాని ఒప్పుకోరు. ఇలా చాలా ఎంపికగా సినిమాలు చేసుకుంటూ సక్సెస్ అందుకున్న ఈమె తన వద్ద సహాయం చేసే అంత డబ్బు ఉందని చెప్పడంతో ఆ డబ్బుతో ఈమె సహాయం చేయడానికి సిద్ధమయ్యారా ఏదైనా పేదలకు సహాయం అందించబోతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి..!!