తాజాగా జరిగిన ఫిలింఫేర్ అవార్డు కార్యక్రమంలో భాగంగా సాయిపల్లవి కూడా ఏకంగా రెండు ఫీలింఫేర్ అవార్డులో వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఫిలింఫేర్ అవార్డుల గురించి ఈమె ప్రస్తావిస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ ఏడాది సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సినిమాకు గాను ఉత్తమ నటిగా రెండు ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి చర్చిస్తూ జీవితంలో ఇలాంటి రోజులు తరచూ రావు.. ఒకే ఏడాది రెండు సినిమాలకు ఈ విధమైనటువంటి ప్రశంసలు అందుకోవడం చాలా ప్రత్యేకం.
ఇలాంటి పాత్రలలో నటించి నేను పొందిన అపారమైన ప్రేమకు ఎల్లప్పుడూ కృతజ్ఞురాలిని. ఈ విధమైనటువంటి అందమైన పాత్రలు మరెన్నో రావాలని ప్రార్థిస్తున్నాను అంటూ సాయి పల్లవి చేస్తున్నటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఒకేసారి రెండు ఫిలింఫేర్ అవార్డులను అందుకోవడంతో సాయి పల్లవి సంతోషం వ్యక్తం చేయగా అభిమానుల సైతం సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే సాయి పల్లవి విరాటపర్వం గార్గి సినిమా తర్వాత ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు..!!