in

Sai Pallavi becomes fidaa over Mahesh Babu’s flawless skin!

యసు పెరుగుతున్న కొద్దీ సూపర్ స్టార్ మహేష్ అందం మరింత పెరుగుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన మరింత యంగ్‌గా మారిపోతున్నాడు. మహేష్ అందంపై సామాన్యులే కాదు సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్యాలెంటెడ్ బ్యూటీ సాయిపల్లవి కూడా తాజాగా మహేష్ అందంపై ప్రశంసలు కురిపించింది.  సాయిపల్లవి తాజాగా ఓ బాలీవుడ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ అందం గురించి మాట్లాడింది.

`మహేష్ చాలా అందంగా కనిపిస్తారు. ఆయన చర్మంపై చిన్న మచ్చ కూడా ఉండదు. ఒక వ్యక్తి ఇంత పరిపూర్ణంగా కనిపించడం అసాధ్యమని ఆయన ఫొటోలు చూస్తున్నప్పుడు అనిపిస్తుంటుంది. ఆయన చర్మం మెరుస్తుంటుంది. ఆయన ఫొటోలను అప్పుడప్పుడు జూమ్ చేసి చూస్తుంటాను. ఆయన చర్మంపై చిన్న మచ్చ కూడా కనిపించద`ని సాయిపల్లవి పేర్కొంది.

thapsi’s new workout video becomes a hot topic!

comedian Ali turns producer with a remake!