
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ప్ర[/qodef_dropcaps] తి రోజు పండగే’ సూపర్ హిట్ కావడంతో మంచి ఊపుమీద ఉన్నాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్, ఒకవైపు ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు తన మరుసటి చిత్రానికి బాగా ప్రొమోషన్స్ చేస్తున్నాడు సాయి తేజ్. ఈ ప్రేమికుల రోజున మన సింగిల్స్ పవరేంటో చూపించాలి అంటూ ట్విట్టర్ లో సందడి చేస్తున్నారు సాయి తేజ్. తన సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ గురించి మాట్లాడుతూ సాయి తేజ్ ‘సోలో గ ఉంటేనే చాల బెటర్ ఏం టెన్షన్స్ ఉండవు’అని ట్వీట్ చేసాడు. దానికి మంచు విష్ణు కౌంటర్ ఇస్తూ ‘తమ్ముడు తేజూ ఈ ట్వీట్ ను నేను సేవ్ చేసుకుంటున్నాను. ఇంకా ఎన్ని రోజులు సోలోగా ఉంటావో చూస్తానుగా’ అని ట్వీట్ చేసాడు. విష్ణు ట్వీట్ కి సాయి తేజ్ స్పందిస్తూ “విష్ణు అన్న అందరు మీ అంత లక్కీ కాదు కదన్న” అంటూ కౌంటర్ ఇవ్వడం విశేషం.