in

sai dharam tej to get married soon?

సోలో బ్రతుకే సో బెటర్ అంటూ త్వరలో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్న మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇప్పటికే తమ బ్యాచిలర్ జీవితానికి పుల్ స్టాప్ పెట్టిన రానా దగ్గుబాటి, నిఖిల్, నితిన్ బాటలో పెళ్లికి సై అన్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల పెళ్లి ప్రపోజల్ కు తేజ్ ఓకే చెప్పటంతో ఇటీవల ధరమ్ తేజ్ కుటుంబ సభ్యులంతా పెళ్లి కూతురిని కలిసినట్లు తెలుస్తోంది. అయితే ఆ అమ్మాయి ఎవరు, ఏం చేస్తారన్నది మాత్రం తెలియాల్సి ఉంది. రెండు కుటంబాలు పెళ్లికి అంగీకరించినట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. సోలో బ్రతుకే సో బెటర్ మూవీ జీ5లో దసరాకు రిలీజ్ అయ్యే అవకాశం ఉండగా, త్వరలో దేవకట్ట దర్శకత్వంలో ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ పట్టాలెక్కనుంది. ఈ మూవీ చేస్తూనే కొత్త దర్శకుడు కార్తీక్ దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నాడు. పెళ్లికి ముందు ఈ రెండు సినిమాలు పూర్తి చేసి, పెళ్లిపీటలెక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

mehreen wants to do devasena character!

kajal getting married to businessman gautham?