in

sadha shocking comments on balayya and jr ntr!

క‌ప్పుడు యూత్ గుండెల్లో ముద్ర వేసుకున్న స‌దా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమె ల‌వ్ స్టోరీ సినిమాల్లో ఎంత‌గా న‌టించి మెప్పించేదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఒకప్పుడు మంచి ఆఫ‌ర్ల‌తో దూసుకుపోయిన ఈ అమ్మ‌డుకు ఆ త‌ర్వాత ఆఫర్లు త‌గ్గ‌డంతో ఖాళీగానే ఉంటోంది. అయితే మొన్న‌టి వ‌ర‌కు ఓ షోకు జ‌డ్జిగా కూడా చేసింది..ఇక ఇప్పుడు ఆమె జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై చేసిన కామెంట్లు తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ చేసిన‌ట్టు డ్యాన్స్ చేసే హీరోను తాను ఇంతవరకు చూడలేదని షాకింగ్ కామెంట్స్ చేసింది స‌దా.

డ్యాన్సులో ఎంత పెద్ద స్ట‌ప‌మూవ్ మెంట్స్, స్టెప్స్ అయినా స‌రే ఎన్టీఆర్ ఒకేసారి చూసి టేక్ చేస్తాడ‌ని వివ‌రించింది. ఆయ‌న అలా ఎలా చేస్తాడో త‌నుకు అస్స‌లు అర్థం కాదని సదా వివ‌రించింది. మూవీ వర్క్ విషయంలో తార‌క్‌కు ఇంట్రెస్ట్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని స‌దా తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విష‌యంలో చాలా డెడికేటెడ్ గా ప‌నిచేస్తాడ‌ని వివ‌రించింది. ఇక బాలకృష్ణ అయితే అచ్చం చిన్నపిల్లల్లాగే సెట్‌లో ఉంటార‌ని తెలిపింది స‌దా. ఆయ‌న ఎప్పుడూ చాలా ఎన‌ర్జిటిక్‌గా ఉంటార‌ని స్ప‌ష్టం చేసింది.

Anchor Rashmi gautam latest glams photoshoot!

Rana To Host Bigg Boss Telugu Season 5 Replacing Nagarjuna?