in

Rukmini Vasanth demands huge for ntr – neel film!

రుక్మిణీ వసంత్..కన్నడ బ్యూటీ అయినప్పటికీ తక్కువ టైంలోనే తెలుగులో కూడా పాపులర్ అయిపోయింది. ‘సప్త సాగరాలు దాటి- సైడ్ ఎ’ సినిమాలో ఈమె లుక్స్ చూసి తెలుగు యువత ఫిదా అయిపోయింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ రుక్మిణీ మాత్రం చాలా మందికి క్రష్ అయిపోయింది. తెలుగులో ఆమెకు భీభత్సమైన క్రేజ్ ఏర్పడింది. ‘సప్త సాగరాలు దాటి సైడ్ -బి’ పై ఆసక్తి పెరగడానికి కూడా అదే కారణం. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ లో మెయిన్ హీరోయిన్ గా ఎంపికైంది.

ఇక ఈ సినిమా కోసం ఆమె రెమ్యూనరేషన్ భారీగా అందుకుంటున్నట్టు టాక్ నడుస్తుంది..అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ బడా ప్రాజెక్టు కోసం రుక్మిణీ వసంత్ రూ.5 కోట్ల నుండి రూ.6 కోట్ల వరకు డిమాండ్ చేసిందట. ఆమె టీం, మేకప్ వంటి వాళ్ళ ఖర్చులు అన్నీ కలుపుకుని అనమాట. అందుకు దర్శక నిర్మాతలు కూడా సంతోషంగా ఓకే చెప్పేశారట. ఈ సినిమా కనుక హిట్ అయితే రుక్మిణీ రేంజ్ టాలీవుడ్లో మరింత పెరగడం ఖాయం అనే చెప్పాలి..!!

Prabhas is the main Reason Behind Kannappa’s Strong openings!