ఎన్టీఆర్ నెక్స్ట్ టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..డ్రాగెన్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్లకు సంబంధించిన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కాగా ఇప్పటికే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా రుక్మినీ వసంత్ కనిపించనుందని..వీరిద్దరి కెమిస్ట్రీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇలాంటి క్రమంలోనే ఆమెతో పాటు మరో హీరోయిన్స్ శృతిహాసన్ కూడా.. ఎన్టీఆర్ కు జంటగా కనిపించనుందని..స్పెషల్ సాంగ్ లో ఇద్దరు కలిసి చిందేయనున్నారు అంటూ టాక్ నడిచింది. ఇప్పుడు మూడో హీరోయిన్గా డ్రాగన్ మూవీలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు కూడా కనిపించనుందంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. ఆ ముగ్గురితో కలిసి తారక్ డ్రాగన్ మూవీ లో రొమాన్స్ చేయనున్నాడు..!!