in

Roja’s husband RK Selvamani fires on Pooja Hegde!

స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డేపై ప్రముఖ దర్శకుడు..YCP ఫైర్ బ్రాండ్ రోజా భర్త ఆర్కే సెల్వమణి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియా వైరల్‌గా మారాయి. స్టార్‌డమ్‌ వచ్చాక సెట్‌లో తన తీరుతో నిర్మాతలకు అధిక భారం మోపుతుందంటూ ఆయన ఫైర్‌ అయ్యారు. అలాంటి స్టార్‌ హీరోయిన్‌పై పూజాపై డైరెక్టర్‌ ఆర్కే సెల్వమణి చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇటీవల మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన షూటింగ్‌ సెట్‌లో పూజా తీరుపై మండిపడ్డారు.

సెల్వమణి మాట్లాడుతూ.. ‘పూజా హెగ్డె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో షూటింగ్‌ సెట్‌కు ఒకరిద్దరిని మత్రమే తన వెంట తీసుకుని వచ్చేది. కానీ ఇప్పుడు స్టార్‌డమ్‌ వచ్చాక తన టీంలో 12 మందిని వెంట తీసుకుని వస్తుంది. అంతమందిని సెట్‌కు తీసుకువస్తే నిర్మాతలు వారందరి ఖర్చులు భరించవలసి వస్తుంది. ఈ విధంగా పూజా నిర్మాతలపై అధిక భారం వేయడం ఎంతవరకు కరెక్ట్‌’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.

megastar’s birthday feast for fans!

Anchor Manjusha clicked at a private Event!