in

Rini Ann George ‘bad experience’ from young political leader!

లయాళ నటి రిని ఆన్ జార్జ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమె అనేక సినిమాలలో నటించి తనకంటూ గొప్ప పేరు తెచ్చుకుంది. తన నటన అందచందాలతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఇక ఈ చిన్నది తాజాగా తనకు జరిగిన ఓ సంఘటనను పంచుకుంది. కేరళ కాంగ్రెస్ నేత తనకు అసభ్యకరమైన మెసేజ్ లు పంపుతూ చాలా ఇబ్బంది పెట్టాడని పేర్కొంది..

అంతేకాకుండా తనను హోటల్ కి రమ్మన్నాడని ఆరోపించారు. గత మూడు సంవత్సరాల నుంచి అతను ఇలా ప్రవర్తిస్తున్నాడని తెలిపింది. నాపై ఇప్పటివరకు ఎలాంటి దాడి జరగలేదు కానీ చాలామంది వేధింపులకు గురయ్యారు అలాంటి వారి కోసం నేను మాట్లాడుతున్నాను అని రిని ఆన్ జార్జ్ అన్నారు. రిని మాట్లాడిన ఈ మాటలపై కాంగ్రెస్ నేత రాహుల్ స్పందిస్తూ..రిని ఆన్ జార్జ్ మాట్లాడిన మాటలలో ఎలాంటి వాస్తవం లేదంటూ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ మమ్ కూటతిల్ రాజీనామా చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారుతుంది..!!

Anupama reacts to criticism and reviewers about ‘paradha’!

jr ntr’s next bollywood film kept on hold!