
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది రాజా సాబ్’ సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి హారర్ కామెడీ జోనర్‌లో ఈ మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో అందాల భామలు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటి రిద్ధి కుమార్ చేసిన కామెంట్స్ ఒక్కసారిగా టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి..
ప్రభాస్ తనకు గిఫ్ట్‌గా ఇచ్చిన చీరను తాను ధరించినట్లు ఆ ఈవెంట్‌లో రిద్ధి కుమార్ కామెంట్ చేసింది. దీంతో ఒక్కసారిగా ప్రభాస్-రిద్ధి కుమార్ డేటింగ్ చేస్తున్నట్లు సినీ సర్కిల్స్, సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఈ వార్తలపై రిద్ధి కుమార్ తాజాగా స్పందించింది. తనకు ప్రభాస్ దీపావళి పండుగ కానుకగా చీరను గిఫ్ట్‌గా ఇచ్చాడని..అంతకు మించి అందులో ఎలాంటి రూమర్స్ లేవని ఆమె స్పష్టం చేసింది. మరి ఆమె ఇచ్చిన క్లారిటీతో ప్రభాస్‌తో డేటింగ్ వార్తలకు చెక్ పడుతుందో లేదో చూడాలి..!!
