in

RGV, Manoj Bajpayee Reunite for New Horror Comedy

మనోజ్ బాజ్‌పేయ్‌తో వర్మ సినిమా!
తన సినిమాలతో భారతీయ చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్ సృష్టించిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ తన పాత ఫామ్‌ను అందుకునే ప్రయత్నంలో ఉన్నారు. చాలా కాలం తర్వాత బాలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్టును ప్రకటించారు. తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘సత్య’ చిత్ర హీరో మనోజ్ బాజ్‌పేయ్‌తో కలిసి ఆయన మరోసారి పనిచేయబోతున్నారు. వీరిద్దరి కలయికలో ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ అనే హారర్ కామెడీ సినిమా రాబోతున్నట్లు వర్మ అధికారికంగా వెల్లడించారు..

రామ్ గోపాల్ వర్మ ‘పోలీస్ స్టేషన్ మే భూత్’!
ఈ చిత్రంలో మనోజ్ బాజ్‌పేయ్ సరసన కథానాయికగా జెనీలియా నటించనుంది. సినిమా కథాంశాన్ని కూడా వర్మ స్వయంగా తెలిపారు. ఓ పోలీస్ స్టేషన్‌లో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ చేతిలో హతమైన గ్యాంగ్‌స్టర్, దెయ్యంగా మారి అక్కడే తిరుగుతుంటే ఎలాంటి విచిత్ర పరిస్థితులు ఏర్పడతాయనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వివరించారు. హారర్ చిత్రాలు తీయడంలో సిద్ధహస్తుడైన వర్మ, ఈసారి దానికి కామెడీని జోడించి కొత్త ప్రయోగం చేయబోతున్నారు..!!

taja sajja’s ‘Mirai’ becomes the most anticipated film in India!

POLL ABOUT TOLLYWOOD LATEST GLIMPSE AND TEASERS!