ఎవరి గురించి పట్టించుకోకుండా.. తనకు నచ్చినట్టుగా బతికేస్తుంటారు. తన మనసులోని మాటలను నిర్మొహమాటంగా బయపెడుతుంటారు. ఇక వర్మ ఇచ్చే ఇంటర్వ్యూలలో ఖచ్చితంగా యాంకర్లపై ఫన్నీ కామెంట్స్ చేస్తుంటారు. ఇక అమ్మాయిల విషయంలో వర్మ చేసే కామెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల వర్మ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ ప్రస్తుత పరిస్థితులపై రియాక్ట్ అవుతున్నారు. అలాగే తనను పాల్గొన్న టీవీ షోలలో, ఇంటర్వ్యూలలో అక్కడున్న అమ్మాయిలను తెగ పొగిడేస్తుంటాడు. తాజాగా యాంకర్ శ్యామలపై ఓపెన్ కామెంట్స్ చేశారు ఆర్జీవి.
తాజాగా బడవ రాస్కెల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గోన్న రామ్ గోపాల్ వర్మ.. ఆ వేడుకకు హోస్టింగ్ చేస్తున్న యాంకర్ శ్యామలను తనస్టైల్లో తెగ పొగిడేశాడు. వేదికపై వచ్చిన వెంటనే మైక్ పట్టిన ఆర్జీవి.. తాను రాస్కెల్ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే.. ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్లలోంచి ఎలా తప్పించుకున్నారు అంటూ ఓపెన్ కామెంట్స్ చేశారు. దీంతో ఆర్జీవి నోటివెంట ఆ మాటలు విన్న శ్యామల ఆశ్చర్యపోయి తెగ నవ్వేసింది. అంతేకాకుడా.. తనను తోపు, రౌడీ, గుండా ఇలా అన్ని పేర్లతో పిలిచారని.. కానీ తాను రాస్కెల్ కూడా అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. బడవ రాస్కెల్ సినిమా ఈనెల 18న విడుదల కానుంది. ఇందులో పుష్ప సినిమాలో నటించిన ధనుంజయ్ హీరోగా నటించారు.