దర్శకధీరుడు రాజమౌళి ఖ్యాతి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఉంది. జేమ్స్ కెమరూన్ వంటి వాడే.. రాజమౌళి తీసిన సినిమా గురించి, అందులోని సీన్స్ గురించి అంత గొప్పగా వివరిస్తూ వస్తే.. ఎవ్వరికైనా సరే ఈర్ష్య పుడుతుంది. ఇక మన ఇండియన్ డైరెక్టర్లలో చాలా మంది అలానే ఉన్నారట. వారంతా కలిసి ఓ కూటమిలా ఏర్పడి రాజమౌళిని హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారట. ఆ గ్రూపులో తాను కూడా ఉన్నానని, అయితే తనకు నాలుగు పెగ్గులు పడటంతో ఇలా బయటపెట్టేశానని వర్మ ట్వీట్ వేశాడు..రాజమౌళి సర్ దయచేసి మీరు మీ భద్రతను పెంచుకోండి..
ఇండియాలోని ఫిల్మ్ మేకర్స్ అంతా కూడా మీద ద్వేషంతో రగిలిపోతోన్నారు.. వారంతా గూడు పుటాని చేస్తున్నారు..మిమ్మల్ని చంపేందుకు ప్రయత్నిస్తున్నారు.. అందులో నేను కూడా ఉన్నాను.. కానీ నాకు నాలుగు రౌండ్లు పడే సరికి ఇలా చెప్పేశాను అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. అయితే నిజంగానే అలా ఎవరైనా చేస్తారా? అని ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజమౌళి హత్యకు కుట్ర అనేది కేవలం వర్మ వాడిన పదాలు మాత్రమే అని తెలుస్తోంది. రాజమౌళి గొప్పను చెప్పేందుకు, అతన్ని చూసి మిగతా వాళ్లు ఎంతగా జెలసీ ఫీల్ అవుతున్నారో చెప్పే క్రమంలోనే అలా అన్నాడని తెలుస్తోంది. ఏది ఏమైనా మరో కొత్త చర్చకు మాత్రం వర్మ దారి తీశాడు..!!