టీవీ యాంకర్ విష్ణుప్రియ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తల్లి ఇటీవల మృతి చెందారు. ఈ విషయాన్ని విష్ణుప్రియ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. విష్ణు ప్రియ పోస్ట్ తో ఆమె అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విష్ణుప్రియ తల్లి మరణవార్త పట్ల సంతాపం తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. పలువురు సెలబ్రెటీలు కూడా ఆమె కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తూ పోస్ట్ లు చేస్తున్నారు. తన తల్లి మరణ వార్త గురించి చెప్తూ విష్ణు ప్రియ భావోద్వేగానికి గురైంది. తల్లితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ తో పాటు ఆమెతో దిగిన ఫోటోను షేర్ చేసింది.
విష్ణు ప్రియ తన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చింది. ‘‘నా ప్రియమైన అమ్మ.. ఈరోజు వరకూ నువ్ నాకు తోడుగా ఉన్నందుకు ధన్యావాదాలు తెలుపుతున్నాను. నా కడ శ్వాస వరకూ నీ పేరు నిలబెట్టేందుకు నేను కృషి చేస్తాను. ఎప్పుడూ నువ్వే నా బలం, నువ్వే నా బలహీనత. ఇప్పుడు నువ్వు ఈ లోకంలో లేకపోవచ్చు.. కానీ నా ప్రతీ శ్వాసలో నువ్వు ఉంటావని తెలుసు. నాకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు, అందుకే నేను నీకు నా జీవితాంతం రుణపడి ఉంటాను. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా’’ అంటూ విష్ణు ప్రియ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసి పలువురు ఆమె కుంటుంబానికి సానుభూతిని తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు..!!