పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ని అప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇండస్ట్రీ లో వైరల్ గా మారడం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్లకు పవన్ తో రేణు విడాకులు తీసుకోవడం జరిగింది. దీంతో గత కొన్ని సంవత్సరాల నుండి రేణు దేశాయ్ పిల్లలు అకీరానందన్, ఆధ్యా తో కలసి వేరేగా ఉంటున్నారు. ఈ క్రమంలో అనేక మాటలు కూడా రేణుదేశాయ్ పడటం జరిగింది. ముఖ్యంగా అప్పట్లో రెండో పెళ్ళికి రెడీ అయినట్లు ఆమె తెలపటంతో… సోషల్ మీడియా సాక్షిగా రేణు దేశాయ్ చాలా నెగిటివిటీ ఎదుర్కోవటం జరిగింది.
ఈ విషయాన్ని ఆమె కూడా చాలా సందర్భాలు పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు ఆమె ఓ ప్రముఖ స్టార్ హీరోలు అతిపెద్ద క్యారెక్టర్ చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే మాస్ మహారాజా రవితేజ “టైగర్ నాగేశ్వరరావు” అనే పాన్ ఇండియా సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. 1970 లలో స్టువర్ట్ పురంలో పేరుమోసిన గజదొంగ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. గతంలో దొంగాట అనే సినిమా తీసిన డైరెక్టర్ వంశీ కృష్ణ దర్శకత్వంలో రవితేజ ఈ సినిమా చేయనున్నారు.
అయితే ఈ సినిమాలో రవితేజ కి సిస్టర్ పాత్రలో రేణుదేశాయ్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు లేటెస్ట్ ఇండస్ట్రీ టాక్. ఈ వార్త బయటకి రావడంతో ఓ మై గాడ్.. రేణు దేశాయ్ కి ఎంత గట్స్ ఉన్నాయో డేర్ అండ్ డాష్ గా.. ఏకంగా రవితేజ సినిమాలో నటించడానికి రెడీ అయింది.. అని తాజా వార్త పై చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి చాలా అవకాశాలు రేణు దేశాయ్.. వదులుకున్న ట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ తరుణంలో రేణు రవితేజ సినిమాలో నటించడానికి రెడీ అవటం.. నిజంగా గ్రేట్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఎలా ఉంటుందో అని మరికొంతమంది తాజా వార్త పై రియాక్ట్ అవుతుంది. రవితేజ పవన్ మధ్య మంచి డిమాండ్ ఉండటంతో పాజిటివ్ గానే.. రియాక్ట్ అయ్యావు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.