in

renu desai sold her luxurious cars!

రేణు దేశాయ్ తనకు నచ్చిన పనులు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. రెండో పెళ్లి విషయంపై గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్న రేణు దేశాయ్ తాజాగా మళ్లీ వార్తల్లో నిలిచారు. తన రెండు లగ్జరీ కార్లని అమ్మేసి పలువురిని ఆశ్చర్యపరిచారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ ద్వారా వెల్లడించారు. మారిషస్‌లో చమురు లీకేజీ వల్ల జరిగిన నష్టాన్ని గుర్తు చేస్తూ పెట్రోల్‌, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.

రేణు దేశాయ్ ఊహించని పనికి సెలబ్రిటీలంతా అవాక్కవుతున్నారు. `దయచేసి అందరూ ఎలక్ట్రిక్ కార్లు, బైకులను కొనండి. ప్రతీరోజు వాడే పెట్రోల్ , డీజిల్ కు ప్రత్యామ్నయ వనరులను అన్వేషించండి. నేను ఇంధనంతో నడిచే ఆడీ ఏ6 , పోర్షే బాక్సర్ కార్లను అమ్మేసి ఈ ఎలక్ట్రికల్ హ్యుందాయ్ కోన కారుని తీసుకున్నాను. నా రెండు కార్లను అమ్మడం కష్టమైన విషయమే అయినా మారిషస్‌లో జరిగిన చమురు లీకేజీ గురించి చదివి ఈ నిర్ణయం తీసుకున్నాను` అని వెల్లడించింది రేణు దేశాయ్‌.

finally nani agreed for ‘v’ ott release!

rgv about his heroines remuneration!