రెండు సింహాల మధ్య నలిగి పోయిన నటుడు గిరి బాబు, తన సమయస్ఫూర్తి తో తృటిలో ప్రమాదం నుంచి బయట పడ్డారు. యెన్.టి.ఆర్ హీరో గ రాఘవేంద్ర రావు దర్శకత్వం లో సింహ బలుడు సినిమా నిర్మాణం లో ఉండగా, గిరి బాబు గారు కృష్ణ హీరోగా సింహ గర్జన అనే సినిమా మొదలు పెట్టారు. తాను వద్దన్నా, అల్లూరి సీతా రామ రాజు నిర్మించారు అని కృష్ణ మీద యెన్,టి,ఆర్ కోపంగా ఉన్న రోజులు అవి. మాస్ ఎలిమెంట్ తో నిర్మితం అవుతున్న రెండు జానపద చిత్రాలు, పేర్లలో సింహాలు, కథ కూడ రెండు చిత్రాలది ఒకటే, కావాలనే ఆ సినిమా తీస్తున్నారు అని ప్రచారం జరిగింది. అదే విషయం యెన్.టి.ఆర్ గారికి మోశారు కొంతమంది. ఇది తెలిసిన గిరి బాబు గారు కొంత కలత చెందారు. యెన్.టి.ఆర్. గారితో కలహం తన కెరీర్ కి అంత మంచిది కాదు..
అందుకే ఆయనను కలసి విషయం చెప్పాలి అనుకున్న అయన. ఒక రోజు ఉదయాన్నే యెన్.టి.ఆర్ ఇంటికి వెళ్లారు, కబురు కాకరకాయ లేకుండా వచ్చిన గిరి బాబు ను చూసి ఒకింత ఆశ్చర్య పోయారు యెన్.టి.ఆర్. ఆఫీస్ రూమ్ లోకి వెళ్లి, ఆయనను లోపలికి పిలిచారు లోపలి కి వెళ్లిన గిరి బాబు గారు ఎటువంటి సుత్తి లేకుండా, నేరుగా అన్న గారు, సింహబలుడు, సింహ గర్జన కథలు వేరు, వేరు, మీ చిత్రంలో మీరు సోలో హీరో ,మా చిత్రంలో ఇద్దరు హీరోలు, కావాలనే దుష్ప్రచారం జరుగుతుంది అని చెప్పగానే, అవునా అయితే మీరేమి సందేహించకండి బ్రదర్ సినిమా బాగా తీయండి, గో ఎహెడ్ డోంట్ కాంప్రమైజ్, అల్ ది బెస్ట్ అంటూ భజం తట్టి పంపించారట..