in

RELIEF FOR PRABHAS IN LAND CASE!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు తెలంగాణ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆయనకు చెందిన భూమిని తదుపతి ఉత్తర్వులు జారీ చేసే వరకు యధాతథా స్థితిని కొనసాగించాలని న్యాయస్థానం రాష్ట్ర రెవెన్యూ అధికారులకు అదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో సర్వే నెం.5/3లోని 2083 చదరపు గజాల స్థలాన్ని ప్రభాస్ కొనుగోలు చేశారు. కాగా ఈ స్థలం వివాదాస్పదమైందని పేర్కోంటు దానిని కూల్చివేసేందుకు శేరిలింగంపల్లి రెవెవన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో అధికారుల నోటీసులను వ్యతిరేకిస్తూ ప్రభాస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇక ఈ విషయమై తాజాగా హైకోర్టు స్టేటస్ కో విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే భూమి వివాదం తేలేవరకూ స్థలాన్ని నటుడు ప్రభాస్‌ స్వాధీనం చేయడం కుదరదని స్పష్టం చేసిన హైకోర్టు.. సదరు స్థలంలో వున్న నిర్మాణాన్ని ధ్వంసం చేయవద్దని అధికారులకు అదేశించింది. ప్రభాస్‌ పిటిషన్ పై ఇచ్చిన ఇంజంక్షన్‌ ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన దరఖాస్తును వీలైనంత త్వరగా పరిష్కరించాలని కింది కోర్టును రాష్ట్రోన్నత న్యాయస్థానం ఆదేశించింది..ప్రస్తుతం ప్రభాస్ లీగల్ గా పోరాడుతున్నాడు..అయితే ఇంకా స్పష్టమైన తీర్పు రాకుండా ప్రభాస్ ను ఇంకా టెన్షన్ పెట్టాలనే వ్యవహారం నడుస్తుంది. మరి ఈ సమస్య ఎప్పుడు తీరుతుంది, ప్రభాస్ కు తన స్థలం వస్తుందో లేదో వేచి చూడాలి.

netizens fire on anasuya!

KANTA THADI PETTINCHE SUDHAKAR GARI JEEVITHAM!