రిలీజ్ కి నోచుకోని సౌందర్య నటించిన ఆఖరి చిత్రం ” గెలుపు ” . త్రిపురనేని వరప్రసాద్ నిర్మించిన చిత్రం ” గెలుపు” ఈ చిత్రంలో సుహాసిని,లయ, తోపాటు నరేష్ కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. సుహాసిని, లయ, తల్లి కూతుళ్లుగా , నరేష్ సుహాసిని కి భర్తగా, లయకు తండ్రిగా నటించారు. సౌందర్య డెఫన్స్ లాయర్ గ అతిధి పాత్రలో నటించారు. సౌందర్య కెరీర్ లో ఇదే మొదటి మరియు చివరి గెస్ట్ రోల్, అంతకు ముందు ఎంత మంది అడిగిన కూడా, గెస్ట్ పాత్రలో నటించని సౌందర్య, తనను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసింది త్రిపురనేని వరప్రసాద్ కాబట్టి ఆ కృతజ్ఞత తో ఈ చిత్రంలో గెస్ట్ రోల్ కి అంగీకరించారు.
2002 మార్చ్ లో రామోజీ ఫిలిం సిటీ లో గెలుపు చిత్రం షూటింగ్ ప్రారంభించారు త్రిపురనేని వర ప్రసాద్. తాళి విలువ కట్టించుకునే భార్యకే కాదు, కట్టే భర్తకు కూడా తెలియాలి అని ఇతివృత్తం తో సాగె చిత్రం “గెలుపు”. ఈ చిత్రం పూర్తి అయిన తరువాత అయిన ఖర్చుకు పది శాతం లాభం గ ఇచ్చి సినిమాను రామోజీ ఫిలిమ్స్ తీసుకుంటుందని మౌఖికం అయిన ఒప్పందం చేసుకున్నారు. ఆ తరువాత జరిగిన పరిణామాలలో చిత్ర నిర్మాణం లో నష్టాలూ రావటం తో రామోజీ ఫిలిమ్స్ చిత్ర నిర్మాణానికి దూరంగా ఉండటం జరిగింది. రామోజీ ఫిలిమ్స్ వారు తీసుకుంటారు అనే భరోసాతో ఎవరికి ఈ చిత్రాన్ని అమ్మ లేదు నిర్మాత. ఈ పరిణామం వలన రామోజీ ఫిలిం సిటీలోనే. ఫిలిం బాక్స్ లో అలాగే ఉండిపోయిది సౌందర్య గారు నటించిన ఆఖరి చిత్రం అయిన “గెలుపు” . ఈ చిత్రానికి అసలు విముక్తి ఉందా?