పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తో ప్రముఖ డైరెక్టర్ తివ్రిక్రమ్ శ్రీనివాస్ కు ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..??? వీరిద్దరూ మామా-అల్లుళ్లు అవుతారు. అవును సిరివెన్నెల సొంత సోదరుడి అమ్మాయినే త్రివిక్రమ్ శ్రీనివాస్ పెళ్లిచేసుకున్నారు. వీళిద్దరూ బంధువులు అయ్యే క్రమంలో జరిగిన సంఘటన కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సినిమా ఫీల్డ్ లో డైలాగ్ రైటర్ గా, డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ అంటే సిరివెన్నెలకు ప్రత్యేక అభిమానం ఉండేది. అందుకే ఆయనకు తన ఇంట్లోనే పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో తాను చూసిన అమ్మాయిని కాకుండా వాళ్ల చెల్లెలిని అంటే సిరివెన్నెల సోదరుడి అమ్మాయిని త్రివిక్రమ్ ఇష్టపడ్డాడు. ఐతే మొదట్లో సిరివెన్నెల ఇంట్లో వాళ్లు ఇష్టపడకపోయినప్పటీ ఆ తర్వాత ఒప్పుకున్నారు. అలా మొత్తానికి వీరిద్దరి మధ్య మామా-అల్లుళ్ల సంబంధం ఏర్పడింది.