ఇండస్ట్రీకి పరిచయమైన సుమారు 14 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది రెజీనా. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంగ్లిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుందీ చిన్నది. భాష కారణంగా తాను బాలీవుడ్‌లో పలు చిత్రాలను వదులు కోవాల్సి వచ్చిందని తెలిపింది. హిందీ సినిమా కోసం ఆడిషన్ ఇచ్చినప్పుడు ఆ భాష మాట్లాడగలనో, లేదో అని చూశారన్నారు. అయితే దక్షిణాది సినిమా పరిశ్రమలో ఈ విషయాన్ని పట్టించుకోరని, ఏ భాషకు చెందినవారినైనా ఎంపిక చేసుకుంటారన్నారు..
అందుకే కోలీవుడ్, టాలీవుడ్‌లలో ఇతర భాషలకు చెందిన ఎంతోమంది నటీనటులు అగ్ర తారలుగా ఎదిగారన్న రెజీనా..హిందీ సరిగ్గా మాట్లాడలేకపోయినందున ఎన్నో అవకాశాలు కోల్పోయానని చెప్పుకొచ్చింది. ‘నేను పంజాబీ అమ్మాయిగా నటించలేను. కానీ, ఒక పంజాబీ అమ్మాయి మాత్రం దక్షిణాది నటిగా చేయగలదు. నా విషయంలో అదే జరిగింది. నార్త్‌లో నటిస్తున్న హీరోయిన్‌లే సౌత్ ఇండియన్ సినిమాల్లోనూ నటిస్తున్నారు’ అని రెజీనా తాజా ఇంటర్వ్యూలో తెలిపింది..!!