గతంలో రేజీనాకి సందీప్ కిషన్ , సాయి తేజ్ లతో అఫైర్లని, పెళ్లి అంటూ పుకార్లు వస్తూనే ఉన్నాయి. వాటిన్నటికి చెక్ పెడుతూ సందీప్, సాయి తేజ్ తనకి కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని, అయినా వారితో తన బాండింగ్ స్పెషల్ గా ఉంటుందని పేర్కొంది. ‘సందీప్, నేను టామ్ అండ్ జెర్రీ లా ఫైట్ చేసుకుంటామని, ఒకరిపై ఒకరం అరుచుకుంటామని, కోపంతో నెలల తరబడి మాట్లాడుకోవటం మానేస్తామని తర్వాత అసలేం జరగనట్టే మళ్లీ మాట్లాడుకుంటామని తెలిపింది. సాయి ధర్మ తేజ్ ఎప్పుడూ పీస్ ఫుల్ గా ఉంటాడు. స్వీట్ పర్సన్. సాయితో నా బంధం చాలా స్పెషల్, సందీప్‌తో గొడవపడినట్లు సాయితో గొడవలు పడను, అసలు మేమిద్దరం ఎప్పుడూ గొడవపడిన సందర్భమే లేదు అని చెప్తూ ఎప్పటికప్పుడు మాకు మీడియాలో పెళ్లి చేసేస్తూనే ఉన్నారని ఆరోపించింది. మొత్తానికి సాయి తేజ్ సందీప్ కేవలం ఫ్రెండ్స్ అని పుకార్లలకి ఫుల్ స్టాప్ పెట్టేసింది..!!