టాలీవుడ్ అందాల భామ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం ఆమె తన స్నేహితులతో కలిసి ఇండోనేషియా వెళ్లింది. ప్రస్తుతం సమంత బాలీ ద్వీపంలో ఉంది. సమంత అక్కడి నుంచి తన చిత్రాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈ చిత్రాల్లో సమంత తన జుట్టు కూడా కట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. తాజాగా సమంత మరికొన్ని చిత్రాలను తన ఇన్ స్టాలో పంచుకుంది. వాటిలో సమంత ఐస్ క్యూబ్స్ వాటర్ టబ్ లో కూర్చుని ఉంది.
దానికి క్యాప్షన్ గా 4 డిగ్రీలు..ఆరు నిమిషాలు అంటూ రాసుకొచ్చింది. అది ఎంతో సాహసోపేతమైనదిగా అభిమానులు పేర్కొంటున్నారు. ఐస్ బాతింగ్ అనేది ఒక రకమైన థెరపీ. దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తోంది. అందుకే సామ్ కూడా ఐస్ బాత్ ట్రీట్మెంట్ ట్రై చేసినట్లు తెలుస్తోంది. అయతే ఇది అనుకున్నంత తేలిక కాదు. మయోసైటిస్ వ్యాధి బారిన పడినట్లు ప్రకటించిన తరువాత సమంత చాలా రోజులు ఇంటికే పరిమితమయ్యారు. తరువాత కొద్ది రోజులు షూటింగ్స్ లో పాల్గొని సినిమాలు పూర్తి చేసింది..!!