సమంతకు మయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి సోకాక కొంత కాలం ఆ విషయాన్ని దాచిపెట్టింది. కానీ చివరికి ఆమె దీని గురించి ఓపెన్ అయిపోయింది. అందుకు తాను నటించిన యశోద మూవీనే కారణం అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది సామ్. ముందు ఈ విషయాన్ని బయటపెట్టాలని అనుకోలేదని.. కానీ యశోద మూవీకి నష్టం జరుగుతోందని భావించి ఆ విషయాన్ని చెప్పాల్సి వచ్చిందని సామ్ తెలిపింది.
reason why samantha had to reveal about her health problems!
ఆ టైంలో తన గురించి రకరకాల రూమర్లు ప్రచారంలోకి వచ్చాయని..సినిమాకు ప్రమోషన్ లేకపోవడం వల్ల చచ్చిపోయే పరిస్థితి ఉందని నిర్మాత ఆవేదన చెందడంతో తాను బయటికి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వచ్చిందని..అప్పుడే తనకు మయోసైటిస్ సోకిన విషయాన్ని వెల్లడించానని సమంత చెప్పింది. ఇక తన కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడు కూడా తాను పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయినట్లు సమంత వెల్లడించింది..!!