in

reason Why Keerthy Suresh Not Rushing into Films now!

కీర్తి మాట్లాడుతూ..సినీ ఇండస్ట్రీలో నేను చేయాల్సిన ప్రయాణం ఇంకా చాలా ఉంది. అందుకే వరుసగా సినిమాలను ఒకే చేయడం లేదు. ఒక పక్క గ్లామరస్ రోల్స్ చేస్తూనే మరోపక్క పాత్ర ప్రధానమైన సినిమాలు చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో చాలా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు. ఆడియన్స్ నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ఇక బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో బేబీ జాన్ సినిమా చేశాను. ఇది తమిళ తెరీ సినిమాకు రీమేక్..

‎అది నా కెరీర్‌ లో మరో ఉత్తేజకరమైన అధ్యాయం అని చెప్పాలి. కేవలం నన్ను సవాలు చేసే పాత్రల కోసం, కొత్త కొత్త కథల కోసం మాత్రమే బాలీవుడ్‌ లో అడుగు పెట్టాను. అక్కడ పనిచేసే విధానం, వారి సంస్కృతి కొత్తగా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటూ, కొత్త విషయాలను నేర్చుకుంటున్నాను. మొత్తంగా ఆ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాను. సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ అవ్వాలంటే ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలని మా నాన్న కండీషన్ పెట్టారు. ఆ మక్కువతోనే చదువులో కూడా ఫ్యాషన్ డిజైనింగ్ ఆప్టిన్ తీసుకున్నాను అని చెప్పుకొచ్చింది హీరోయిన్ కీర్తి సురేష్..!!

samantha dosen’t want to be just an actress!

Deepika Padukone Out of prabhas Kalki 2!