
వెండి తెర మీద హీరో లు చాల మంది ఉంటారు, తెర మీద నిజ జీవితం లో కూడా హీరో నందమూరి హరికృష్ణ గారు. చాల డైనమిక్ అండ్ పవర్ఫుల్ పెర్సనాలిటీ, చాలా సున్నిత మనస్కుడు మరియు తండ్రి వారసత్వం గ క్రమశిక్షణ కలిగిన వారు హరికృష్ణ గారు. 25 ఇయర్స్ లాంగ్ గ్యాప్ తరువాత శ్రీరాములయ్య చిత్రం లో సత్యం అన్న గ ఒక నక్సలైట్ రోల్ లో కనిపించరు. ఆయన పవర్ఫుల్ యాక్షన్ తో ప్రేక్షకుల ను రోమాంచితులను చేయటమే కాకా కంట తడి పెట్టించారు. సత్యం పాత్ర చేయటానికి చిత్ర సీమ లోని నటులంతా భయపడుతుంటే దేర్యం గ ఆ పాత్ర చేసి మెప్పించారు. ఈ మూవీ నుంచి అయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసారు, వరుసగా “సీతయ్య”, శివరామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ గ అన్ని సందేశాత్మక పాత్రలు చేసారు. మళ్ళీ నటించాలి అనే కోరిక తో ఈ క్యారెక్టర్స్ చేయ లేదు, ఎంతో కొంత సామాజిక స్పృహ ఉన్న రోల్స్ కావటం తో నటించాను అని చెప్పే వారు. ఈ క్రమం లో నే వై.వి.ఎస్. చౌదరి నిర్మించిన” లాహిరి లాహిరిలో ” ఒక సన్నివేశం లో ప్రాణాలకు తెగించి యాక్ట్ చేసారు హరికృష్ణ. ప్రత్యర్థి జయప్రకాష్ రెడ్డి ఎదురుగా కార్ లో వస్తుండగా రైల్వే ట్రాక్ ను క్రాస్ చేసే క్రమం లో వారిని ఆగమని లైట్లు వేసిన ముందుకు వచ్చేస్తాడు జయప్రకాశ్ రెడ్డి. దీనితో రెండు కార్లు రైల్వే ట్రాక్ పైన ఆగిపోతాయి, ఒక వైపు నుంచి రైలు వస్తుంటుంది, రైలు దగ్గరగా రావటం తో భయపడిన జయప్రకాశ్ రెడ్డి కారు వెనకకు తీసుకుంటారు, వెంటనే కారు స్టార్ట్ చేయటానికి ప్రయత్నించిన హరికృష్ణ గారి కారు స్టార్ట్ అవలేదు, షూట్ చేస్తున్న యూనిట్ మొత్తం భయపడి పోయారు, కానీ హరికృష్ణ గారు ఎటువంటి కంగారు లేకుండ రెండవసారి, మూడవసారి ప్రయత్నించి కారు స్టార్ట్ చేసుకొని ముందుకు వెళ్లిపోయారు, క్షణాలలో రైల్ ఆ ప్రాంతాన్ని దాటి వెళ్ళిపోయింది. యూనిట్ అంత ముచ్చెమటలతో, ఆయనను అభినందించారు కానీ లోపల బిక్క ఛఛ్చి పోయారు. కారు ముందుకు వెళ్ళాక “మగాడు అన్నాక తెగింపు ఉండాలి , చావుకు మనం భయపడ కూడదు, చావే మనలను చూసి భయపడాలి”అనే డైలాగు చెప్తారు అయన. వెండి తెర మీదే కాదు నిజ జీవితం లో కూడా హరికృష్ణ గారు యెంత డేరింగ్ అండ్ డాషింగ్ గ ఉండే వారు అనటానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే.

