జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలన్నదే తన సిద్ధాంతమని, సినిమా ఫలితం గురించి ఏమాత్రం బాధపడనని చెప్పింది బెంగళూరు చిన్నది నభానటేష్. పెద్ద లక్ష్యాల్ని పెట్టుకొని పరిశ్రమలోకి రాలేదని.. మంచి నటిగా తనను ప్రేక్షకులు గుర్తుంచుకుంటే చాలని పేర్కొంది. తెలుగునాట యువతరంలో ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆకట్టుకునే అందచందాలతో పాటు చలాకీ నటనతో అభిమానుల్ని సొంతం చేసుకుంది.
కేవలం గ్లామర్ రోల్స్‌లోనే కాకుండా అభినయప్రధాన పాత్రల్లో మెప్పించాలనే లక్ష్యంతో కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నానని నభానటేష్ తెలిపింది. ఆమె మాట్లాడుతూ ‘ఇండస్ట్రీలోని పోటీతత్వం గురించి అస్సలు ఆలోచించను. నా ప్రతిభపై పూర్తి నమ్మకం ఉంది. ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగల సత్తా ఉందని దర్శకులు విశ్వసిస్తున్నారు. భవిష్యత్తులో ఛాలెంజింగ్ రోల్స్ కోసం ఎదురుచూస్తున్నా’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ సుందరి తెలుగులో ‘మాస్ట్రో’ చిత్రంలో నాయికగా నటిస్తోంది.