హీరో రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’సినిమా వినికిడి శక్తి లేని వారిని సైతం అలరించే విధంగా కొత్త వెర్షన్ సిద్ధమైంది. సైన్ లాంగ్వేజ్‌లో ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. భారతీయ సినిమాల్లో ఇలా సైన్ లాంగ్వేజ్‌లో విడుదల అయిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం. దీంతో మొదటి సైన్ లాంగ్వేజ్ సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఎక్స్ ద్వారా వెల్లడించింది.
వినికిడి శక్తి లేని దివ్యాంగులు అంతా ఈ వెర్షన్‌ను చూసి సినిమాని ఎంజాయ్ చేయవచ్చు. సినిమాలో ప్రతి డైలాగ్‌నీ పక్కన సైన్ లాంగ్వేజ్‌ఎక్స్‌పర్ట్ వివరిస్తూ ఉంటారు. దీంతో సినిమా అంతా వారు సైగల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ విషయమై మేకర్స్ ఒక ప్రోమో కూడా విడుదల చేశారు. ఈ సైన్ లాంగ్వేజ్‌లో అందుబాటులో ఉన్న మొదటి ఇండియన్ సినిమా తమ ‘టైగర్ నాగేశ్వరరావు’ అంటూ వెల్లడించారు..!!