
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని ఇప్పుడు మెగాఫోన్ పట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. రవితేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు. దీనికి ‘ఈగల్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి హీరోయిన్ దొరకడం లేదట. అనుపమ పరమేశ్వరన్, కృతిశెట్టి, ప్రియా వారియర్, రీతూవర్మ.. అలానే మరో ఇద్దరు హీరోయిన్లను సంప్రదించారు. కానీ ఎవరూ ఫైనల్ కాలేదని తెలుస్తోంది. రోల్ నచ్చక కొంతమంది.. డేట్స్ సర్దుబాటు చేయలేక మరికొంతమంది సినిమాను అంగీకరించలేదు. సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపు పూర్తయింది. సినిమా మొదలుపెట్టడమే ఆలస్యం కానీ హీరోయిన్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి కలుగుతోంది.