కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ మొత్తం స్తంభించిపోయింది. దీంతో రిలీజ్ కావాల్సిన సినిమాలు ఆగిపోయాయి. రిలీజ్ చేయాల్సిన సినిమాలు చివరి దశలో నిలిచిపోయాయి. ఇంకొన్ని సినిమా షూటింగ్స్ మధ్యలోనే ఆగిపోయాయి. అయితే ఇటీవలే సినిమా షూటింగులకు పర్మిషన్ ఇచ్చాయి ప్రభుత్వాలు. దీంతో షూటింగులకి వెళ్లినా కరోనా మాత్రం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. దీంతో కొన్ని షూటింగ్స్ వాయిదా పడ్డాయి. పోనీ ఏదోలా షూటింగ్స్ పూర్తి చేసినా.. థియేటర్స్ తెరవని పరిస్థితి. ఇంకో రెండు నెలలు దాకా థియేటర్స్ తెరిచే దాఖలాలే కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు తర్జనభర్జనలు పడుతున్నారు. కొందరు చేసేదేమీ లేక స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాంలలో రిలీజ్ చేస్తున్నారు.
ravi teja ‘krack’ in ott?
ఇక ఇలాగనే రవితేజ, శ్రుతిహాసన్ ‘క్రాక్’ సినిమా కూడా ఓటీటీలో విడుదల కానుందని పలు వార్తలు ప్రచారమవుతున్నాయి. క్రాక్ సినిమాకు గోపీ చంద్ మలినేని దర్శకత్వం వహించగా.. సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ పతాకం పై బి. మధు నిర్మిస్తున్నారు. ‘వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అన్యాయాన్ని ఎదురించే నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో’ రవితేజ కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్‌కి, టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. కాగా ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు.