in

ravi teja beauty Bhagyashri Borse Gets Another crazy Offer!

త్వరలోనే సూర్య తొలి తెలుగు స్ట్రైట్ సినిమా అనౌన్స్ మెంట్ రాబోతుందని ఫిల్మ్ నగర్ టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య సినిమా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్స్ ని ఫిక్స్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. బాలీవుడ్ లో ఒక సినిమా చేసి హరీష్ శంకర్ దృష్టిని ఆకర్షించిన భాగ్య శ్రీ  రవితేజతో మిస్టర్ బచ్చన్ ఛాన్స్ పట్టేసింది. ఐతే తెలుగు ఎంట్రీ గ్రాండ్ గానే ఇచ్చినా సినిమా మాత్రం వర్క్ అవుట్ కాలేదు.

ఐతే ఆ రిజల్ట్ అమ్మడి కెరీర్ మీద ఎఫెక్ట్ పడలేదని అర్ధమవుతుంది..ప్రస్తుతం భాగ్య శ్రీ బోర్స్ దుల్కర్ సల్మాన్ తో కాంత, విజయ్ దేవరకొండతో కింగ్ డమ్, రామ్ తో ఒక సినిమా చేస్తుంది. ఈ మూడు కాకుండానే సూర్య వెంకీ అట్లూరి కాంబో సినిమా ఛాన్స్ కూడా అందుకున్నట్టు తెలుస్తుంది. సూర్యతో చేస్తున్న సినిమా పాన్ ఇండియా రిలీజ్ ఉంటుంది. సో భాగ్యానికి మరో బపర్ ఆఫర్ తగిలినట్టే అన్నమాట. ఈ సినిమాల్లో ఏ ఒక్కటి సూపర్ హిట్ అయినా భాగ్య శ్రీ కెరీర్ దూసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు..!!

Suriya straight Telugu film with lucky bhaskar director Venky Atluri

Krithi Shetty to romance Mass Ka Das Vishwak Sen!