
యానమదల కాశీ విశ్వనాధ్, మంచి గుర్తింపు ఉన్న క్యారెక్టర్ నటుడు, దాదాపు 150 చిత్రాలలో నటించారు, నటుడు కాక ముందు ఈయన డైరెక్టర్ గ రెండు సూపర్ హిట్ చిత్రాలు చేసారు తరుణ్, ఆర్తి అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా సురేష్ ప్రొడక్షన్స్ లో, “నువ్వులేక నేను లేను”, మరియు నందమూరి కళ్యాణ్ రామ్ మొదటి చిత్రం ఉషాకిరణ్ మూవీస్ లో, “తొలి చూపులోనే” అటువంటి హిట్ చిత్రాలు అందించిన డైరెక్టర్, నటుడిగా ఎలా మారారు, ఎవరి ప్రోత్సాహం తో అంటారు? తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ ఇంటరెస్టింగ్ స్టోరీ చదవండి. తన థర్డ్ ఫిలిం స్టోరీ రెడీ చేసుకొని అన్నవరం వెళ్లి పూజ చేయించుకొని ప్రదక్షిణలు చేస్తున్న కాశీ గారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది, రవి బాబు డైరెక్ట్ చేస్తున్న “నచ్చావులే ” సినిమా లో హీరో ఫాదర్ క్యారెక్టర్ చేయమని.రవి బాబు తో మంచి ఫ్రెండ్షిఫ్ ఉండటం తో సరదాగా ఆట పట్టిస్తున్నారు అనుకున్నారట కాశీ గారు. హెదరాబాద్ వచ్చాక కూడా రవి బాబు వదలకుండా తగులుకోవటం తో ఇంట్లో వారితో డిస్కస్ చేస్తే, వారు కూడా వద్దనే చెప్పారట, పట్టువదలని రవి బాబు ఒక రోజు ఉదయాన్నే కాస్ట్యూమర్ ను ఇంటికి పంపించారట, కాస్ట్యూమ్స్ కొలతల కోసమని, ఇక తప్పేట్టు లేదని ఆ క్యారెక్టర్ ఒప్పుకున్నారు కాశీ గారు. దాని తరువాత నటుడిగా అయన ప్రయాణం చేయటం, ఆ ప్రయాణం ఆలా కొనసాగుతూనే ఉంది.ఎప్పటికి అయినా మళ్ళీ డైరెక్టర్ గ స్థిరపడాలి అనేది కాశీ గారి కోరిక, మరి చూడాలి భవిష్యత్ ఎలా ఉండబోతుందో.

