సినీ పరిశ్రమలో వారసుల పరంపర కొత్తేం కాదు. అయితేఈ ఏడాది బాలీవుడ్ లోకి ఓ వారసురాలు ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని. ఈమెకు ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. రకరకాల ఫొటోషూట్స్ తో నెట్టింట్లో సందడి చేస్తోన్న ఈమె.. రవీనా కూతురిగా కూడా మంచ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా బాలీవుడ్ లో ఎంట్రీకి ఆమె క్లియరెన్స్ ఇచ్చింది..
17ఏళ్ల రాషా తడానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుండగా.. ఈసినిమాతో హీరో అజయ్ దేవగణ్ మేనల్లుడు కూడా అమన్ దేవగణ్ హీరోగా నటించబోతున్నట్టు సమాచారం. అయితే అభిషేక్ కపూర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ఇద్దరు స్టార్ పిల్లలు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారన్నమాట. ఈ యంగ్ కపుల్ ఎంట్రీ మూవీ మార్చి నెలలో సెట్స్ పైకి వెళ్లనుందని ఈ సమాచారం..!!