in

Rashmika to romance Vijay Devarakonda Again?

గీత గోవిందంతో హిట్ జోడీ అనిపించుకొన్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ – ర‌ష్మిక‌. ఆ త‌ర‌వాత ఇద్ద‌రూ డియ‌ర్ కామ్రేడ్‌ లోనూ జంట‌గా న‌టించారు. ఇప్పుడు మ‌రోసారి ఈ జోడీని తెర‌పై చూడ‌బోతున్నాం. విజ‌య్ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. రాహుల్ సంకృత్యాన్ ద‌ర్శ‌కుడు. విజ‌య్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. అయితే క‌థానాయిక‌, ఇత‌ర వివ‌రాల్ని ప్ర‌క‌టించ‌లేదు.

ఈ చిత్రంలో ర‌ష్మిక‌ను క‌థానాయిక‌గా ఎంచుకొన్న‌ట్టు స‌మాచారం. విజ‌య్‌తో ర‌ష్మిక‌కు ఇది హ్యాట్రిక్ సినిమా కానుంది. ఇందులో విజ‌య్ డ్యూయ‌ల్ రోల్ చేయ‌బోతున్నార‌ని, తండ్రీ కొడుకులుగా క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తోంది. విజ‌య్ ద్విపాత్రాభిన‌యం చేయ‌డం ఇదే తొలిసారి. దాదాపు రూ.120 కోట్ల‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నార‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. విజ‌య్ ప్ర‌స్తుతం గౌత‌మ్ తిన్న‌నూరితో ఓ సినిమా చేస్తున్నాడు..!!

happy birthday ram pothineni!

Top 10 Most Followed Tollywood Actors on Instagram!