2023, 24 లలో వరస విజయాలు తన ఖాతాలో వేసుకున్న రష్మిక 2025 కూడా తనదే అంటోంది. రష్మిక చేతిలో ప్రస్తుతం అరడజను పైగా సినిమాలున్నాయి..ప్రస్తుతం రష్మిక హిందీలో విక్కీకౌశల్ కి జోడిగా ‘ఛావా’ మూవీ చేస్తోంది. 2025 ఫిబ్రవరిలో చావా రిలీజ్ కానుంది. నెక్స్ట్ సల్మాన్ ఖాన్ తో సికిందర్ మూవీ చేస్తోంది. ఈ మూవీని మురుగుదాస్ తెరకెక్కిస్తున్నారు. సికిందర్ 2025 ఈద్ స్పెషల్ గా మార్చ్ లో రిలీజ్ అవుతోంది..
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే బైలింగ్వల్ మూవీ లో రష్మిక లీడ్ రోల్ చేస్తోంది. నాగార్జున, ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర రూపొందుతోంది. ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2025 ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. ఇవి కాక బాలీవుడ్ లో ‘థమా’ అనే హార్రర్ కామెడీ మూవీలో ఆయుష్మాన్ ఖురానాకి జోడీగా రష్మిక నటిస్తోంది. 2025 దీపావళికి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. వీటితో పాటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీలో ఫిక్స్ అయ్యింది..!!