in

Rashmika takes legal action over leaked audio of her mother!

టి రష్మిక మందన్న తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న అసత్య ప్రచారాల పట్ల అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. నటుడు విజయ్ దేవరకొండతో వివాహం జరిగిన కొద్ది రోజులకే, ఎనిమిదేళ్ల క్రితం నాటి తన తల్లి ఆడియో క్లిప్‌ను కావాలనే బయటకు తీసి వివాదం సృష్టించడంపై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత ఎనిమిదేళ్లుగా తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులను మౌనంగా భరించానని, అయితే ఇప్పుడు తన కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగడం అన్ని హద్దులను దాటడమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు..

ఒకరి అనుమతి లేకుండా ప్రైవేట్ సంభాషణలను రికార్డ్ చేయడం, అందులోని కొంత భాగాన్ని మాత్రమే వాడుకుని తప్పుడు అర్థాలు వచ్చేలా ప్రచారం చేయడం తన ప్రైవసీకి భంగం కలిగించడమేనని రష్మిక స్పష్టం చేశారు. వ్యూస్ కోసం ఒకరి గౌరవాన్ని తాకట్టు పెట్టే ధోరణిని ఇకపై సహించేది లేదని హెచ్చరించారు. తప్పుడు వార్తలు, ఆ ఆడియో క్లిప్‌ను ప్రచారం చేస్తున్న వారికి ఆమె 24 గంటల సమయాన్ని నిర్దేశించారు. ఈ గడువులోగా వాటిని తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని సంబంధిత వ్యక్తులకు, మీడియా సంస్థలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు..!!

lock down!

Hansika Motwani divorced from husband Sohael Khaturiya!