గత ఐదు సంవత్సరాల నుంచి పుష్ప టీం తో కలిసి పని చేసిన రష్మిక మందన్న గత నవంబర్ 25 న తన ఆఖరి రోజు షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. సినిమా టీం తో ఎన్ని సంవత్సరాలుగా తాను గడిపిన క్షణాలని తలుచుకొని ఎమోషనల్ అయింది. అదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో షేర్ చేసుకుంది. పుష్ప సినిమాకు సంబంధించి నాకు అదే చివరి రోజు అని తెలిసినప్పటికీ నాకు అలా అనిపించలేదు.
ఎందుకనేది ఎలా చెప్పాలో తెలియడం లేదు నా 7,8 ఏళ్ల సినీ కెరియర్ లో గత ఐదు సంవత్సరాలు దాదాపు ఈ సినిమా సెట్ లోనే గడిచిపోయాయి. ఈ సినిమా తో ఎంతో అలసిపోయాను అదే సమయంలో ఎంతో గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను. గొప్ప వ్యక్తులతో కలిసి పని చేయటం, మనకు తెలియకుండానే వారితో అనుబంధం ఏర్పడటం క్రేజీగా ఉంది. ఇలాంటి సమయంలోనే షూటింగ్ అయిపోయిందంటే చాలా బాధగా ఉంది, ఈరోజు నాకు చాలా విలువైనది అంటూ భావోద్వేగానికి లోనైంది..!!