in

Rashmika Reveals The Hardest Things She Had for ‘goodbye’!

హిందీలో వికాస్‌భల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుడ్‌బై’ అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో అమితాబచ్చన్ కూడా ప్రధాన పాత్రలో నటించాడు. కుటుంబ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రష్మిక ‘తారా భల్లా’ అనే పాత్రలో ప్రేక్షకుల ముందుకి రానుంది. అక్టోబర్ 7వ తేదీన సినిమా విడుదల కానుండటంతో సినిమా ప్రమోషన్లు ప్రారంభమయ్యాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక ఈ సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ క్రమంలో రష్మిక మాట్లాడుతూ ఈ సినిమాలోని తారాభల్ల అనే పాత్ర తనకు చాలా ప్రత్యేకమైనదని చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగినా కూడా డబ్బింగ్ విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పడినట్లు రష్మిక వెల్లడించింది. సాధారణంగా కర్ణాటక కి చెందిన రష్మిక కన్నడ కాకుండా ఏ ఇతర భాషలలో డబ్బింగ్ చెప్పాలన్న కొంచెం ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా హిందీలో డబ్బింగ్ చెప్పటానికి చాలా ఇబ్బంది పడినట్లు ఈ సందర్భంగా వెల్లడించింది. కానీ సరైన పద్ధతిలో ట్రైనింగ్ తీసుకోవడం వల్ల డబ్బింగ్ కూడా విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పకొచ్చింది..!!

Anushka Shetty to Marry a Gold Businessman Based of Telangana?

VV Vinayak says no plans of ‘Adhurs 2’ with Jr NTR!