
కేవలం తెలుగులోనే కాదు..తమిళ్, హిందీ భాషల్లోను అవకాశాలు కొట్టేస్తుంది. ఇక పుష్ప సినిమా తర్వాత యానిమల్, ఛావా సినిమాలు వరుసగా హిట్లు గా నిలిచాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వర్షం కురిపించాయి. దెబ్బతో రష్మిక సౌత్ లక్కి హీరోయిన్గా మారిపోయింది. ఇక.. ఈ అమ్మడు రీసెంట్ గా చేసిన గర్ల్ ఫ్రెండ్ మూవీతో మరోసారి సక్సెస్ ఖాతాలో వేసుకుంది. ఇక 2024 నుంచి 2025 వరకు సక్సెస్‌లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఏడది మరిన్ని ప్రాజెక్టులతో పలకరించేందుకు సిద్ధమవుతుంది..
అయితే ఈ ప్రాజెక్టుల కోసం..రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఛార్జ్ చేస్తుందట. 2026లో తను నటించిన సినిమాల కోసం రష్మిక భారీగా డిమాండ్ చేసినట్లు టాక్. వరుస హిట్లతో మంచి జోష్‌లో ఉన్న ఈ అమ్మడు..ఒక్కసారిగా రెమ్యూనరేషన్‌ను రూ.10 కోట్లు పెంచేసిందని సమాచారం. అయితే.. నిర్మాతలు సైతం ఆమె అడిగినంత ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని.. రష్మిక తమ సినిమాలో కనిపించినా చాలు.. నేషనల్ లెవెల్ లో సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కుతుందని మేకర్స్..సినిమాల్లో తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారట..!!