ఆయన రీసెంట్‌గా ‘చంద్రముఖి 2’లో కనిపించగా..ప్రస్తుతం ‘కాంచన 4’తో బిజీగా ఉన్నారు..ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా..మరో క్రేజీ న్యూస్ కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రాజెక్టులో దెయ్యం పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాఘవ లారెన్స్ తాను హీరోగా నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఇప్పటికే పూజా హెగ్డే..
బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓ ప్రత్యేకమైన రోల్ కోసం నేషనల్ క్రష్‌ను రంగంలోకి దించాలని రాఘవ లారెన్స్ భావిస్తున్నారట. ఇప్పటికే దీనిపై సంప్రదింపులు పూర్తైనట్లు తమిళ మూవీ వర్గాల సమాచారం. ఇదే నిజమైతే అటు దక్షిణాదితో పాటు ఇటు ఉత్తరాదిలోనూ అంచనాలు మరింత రెట్టింపు కానున్నాయి. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..!!