in

Rashmika Mandanna Says No to Smoking Scenes!

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల ఆమె ‘వి ద ఉమెన్’ అనే కార్యక్రమంలో పాల్గొని సినిమాల్లో ధూమపానం సీన్లపై, తన కెరీర్ ఎంపికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “వ్యక్తిగతంగా నేను స్మోకింగ్‌ను ప్రోత్సహించను..

అలాంటి సన్నివేశాల్లో నటించడానికి కూడా సిద్ధంగా లేను. ఇది నా అభిప్రాయం. అలాంటి సీన్ చేయమని ఒత్తిడి చేస్తే, ఆ సినిమా వదిలేయడానికి కూడా సిద్ధం. స్క్రీన్‌పై కనపడే ప్రతీ విషయం నిజ జీవితాన్ని ప్రతిబింబించదనే విషయం అందరూ గుర్తుంచుకోవాలి” అని వ్యాఖ్యానించారు. సినిమా చేసేది అభిమానుల కోసం, కానీ అది నా మౌలిక విలువలకు విరుద్ధంగా ఉండకూడదు” అని వ్యాఖ్యానించారు..!!

keerthy suresh demands equal pay!

saptami gowda: my character in ‘Thammudu’ is strong and powerful