in

Rashmika Mandanna Reveals How She Balances Life Beyond Films!

షూటింగ్ లేని రోజుల్లో తన పెంపుడు కుక్కతో సమయం గడపడమంటే ఎంతో ఇష్టమని రష్మిక తెలిపారు. “సాధారణంగా నా పెంపుడు కుక్కతో ఆడుకుంటాను. వాకింగ్‌కు వెళ్తాను. ఖాళీ సమయం దొరికితే మిస్ అయిన షోలు చూస్తాను లేదా పుస్తకాలు చదువుతాను” అని ఆమె అన్నారు. బిజీ లైఫ్‌లో కూడా ఇలాంటి చిన్న చిన్న సంతోషాలను ఆస్వాదించడం ఎంతో ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు.

కేవలం విశ్రాంతికే పరిమితం కాకుండా, తన వ్యాపార వ్యవహారాలను కూడా తానే దగ్గరుండి చూసుకుంటానని రష్మిక స్పష్టం చేశారు. “కొన్నిసార్లు బ్రాండ్ కాల్స్ మాట్లాడాల్సి వస్తుంది. అలాగే నా ‘డియర్ డైరీ’ ప్రాజెక్ట్ పనుల్లో నిమగ్నమవుతాను. ఎందుకంటే ఒక ఫౌండర్‌గా అన్ని విషయాల్లోనూ నేను పాలుపంచుకుంటాను” అని ఆమె వివరించారు. వృత్తిపరమైన పనులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు అధిక ప్రాధాన్యత ఇస్తానని రష్మిక పేర్కొన్నారు.!!

samyuktha menon gets a mega jackpot in telugu!

Tamannaah Bhatia opens up about how childrens enjoy her songs!