తనకు నచ్చింది చేయాలి అనుకుంటుంది..నచ్చకపోతే చేయకూడదు అనుకుంటుంది. అలాంటి క్యారెక్టర్ రష్మికది అని చెప్పాలి. ఇకపోతే రష్మిక ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా రష్మికకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. రష్మిక తన కెరియర్ పరంగా సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉంటున్న సంగతి మనకు తెలిసిందే..
అయితే ఈ స్పెషల్ సాంగ్స్ చేయడం కోసం ప్రత్యేకంగా హీరోయిన్లు ఉంటారు కానీ ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ ఐటమ్స్ స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే రష్మిక సైతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుందట. స్టార్ హీరోయిన్స్ ఐటమ్ సాంగ్ లో కనిపించడం సర్వసాధారణం. కానీ కెరియర్ పీక్స్ లో ఉండగానే రష్మిక మందన్నా ఇలాంటి డెసిషన్ తీసుకుంది ఎందుకు అంటూ ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు..!!