in

Rashmika Mandanna opens up on negative PR and trolls!

ష్మిక మందన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన మనసులోని బాధను బయటపెట్టారు. తనపై జరుగుతున్న ట్రోల్స్ గురించి మాట్లాడుతూ..”నాపై డబ్బులు ఇచ్చి ట్రోల్స్ చేయించారు. నా గురించి నెగటివ్ విషయాలు ప్రచారం చేశారు. నేను ఆ పరిస్థితిని ఎదుర్కొన్నాను” అని అన్నారు. ఇలాంటి చర్యలు తనను చాలా బాధించాయని ఆమె చెప్పారు. నేను ఒక భావోద్వేగ జీవిని. నేను ఎలా ఉన్నానో అలాగే ఉండాలనుకుంటున్నాను..

కానీ నా భావోద్వేగాలను బయటపెట్టడానికి నేను ఇష్టపడను. ఎందుకంటే, ఈ మధ్య కాలంలో ప్రేమగా ఉండడాన్ని కూడా బలహీనతగా చూస్తున్నారు. కెమెరా కోసం రష్మిక ఇలా నటిస్తుంది అని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ప్రేమ, దయ చూపలేకపోతే సైలెంటుగా ఉండండి. ఈ ప్రపంచంలో అందరూ ఎదగడానికి చాలా స్థలం ఉంది. ఒకరు ఎదుగుతుంటే ఎందుకు ఆపాలని చూస్తున్నారు? ప్రజలు ఎందుకు ఇలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయమని తన ఆవేదనను వెళ్లగక్కారు..!!

kushboo reveals about not taking any hormone injections!