ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా ఆఫర్ కూడా పట్టేసిందని అంటున్నారు. అయితే ఇప్పుడు మెగాస్టార్‌తో కూడా ఛాన్స్ కొట్టేసినట్టుగా చెబుతున్నారు. దానికి కారణం చిరునే అమ్మడిని తన సినిమాలో తీసుకోవాలని సూచించారట. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ అనే సినిమాలో నటిస్తున్నారు. బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట ఈ సినిమాను సోషియో ఫాంటసీగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిష నటిస్తుండగా..
ఆషిక రంగనాథ్ లాంటి యంగ్ హీరోయిన్లు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇప్పుడు ఓ ప్రత్యేక పాత్ర కోసం రష్మిక కూడా ఓకె అయినట్టుగా తెలుస్తోంది. విశ్వంభరలో ప్రత్యేక పాత్ర కోసం రష్మిక పేరును సూచించారట మెగాస్టార్. దీంతో.. మేకర్స్ రష్మిక కలిశారట. రష్మిక కూడా చిరంజీవితో ఛాన్స్ అనేసరికి ఓకే చెప్పిందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక రానుందని అంటున్నారు. ఒకవేళ రష్మికకు ఈ మెగా ఛాన్స్ ఓకె అయితే.. అమ్మడికి మరో బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. కానీ ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది..!!