సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలోను ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె షేర్ చేసే గ్లామరస్, ఫ్యాషనబుల్ ఫొటోలకు అభిమానులు, నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. ఈక్రమంలోనే ఫ్యాన్స్ కు మరింత చేరవయ్యేందుకు సొంత యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది రష్మిక. మొదటి వీడియోను కూడా ఆ ఛానల్లో అప్లోడ్ చేసింది. ఇందులో తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ట్రావెలింగ్, యాక్టింగ్, డ్యాన్సింగ్ అంటే తనకెంత ఇష్టమో చెప్పుకొచ్చింది. అదేవిధంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సరదాగాసమాధానాలిచ్చింది. అయితే తన ఎక్స్‌కు సంబంధించిన ప్రశ్నలకు జవాబులివ్వనని ముందుగానే స్పష్టం చేసింది. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ఇటీవల కీర్తి సురేష్, రాశీ ఖన్నా సొంత యూట్యూబ్ ఛానెల్స్‌ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రష్మిక కూడా ఈ జాబితాలో చేసింది.
ఇక పుష్పలో శ్రీవల్లిగా మెప్పించిన రష్మిక ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శర్వానంద్‌తో ఆమె కలిసి నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక తన అప్ కమింగ్సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తెలుగులో పుష్ప సీక్వెల్ పుష్ప: ది రూల్ లో నటించనుంది. ఇక బాలీవుడ్లో సిద్దార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను, అమితాబ్ తో కలిసి గుడ్ బై అనే చిత్రాల్లోనూ నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి..