రష్మిక విజయ్ దేవరకొండ హీరో హీరోయిన్లుగా నటించిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాల సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇక ఈ వార్తలకు అనుగుణంగానే ఎక్కడికి వెళ్ళినా ఈ జంట కలిసి కనిపిస్తున్నారు.
తాజాగా రష్మిక ప్రేమ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రేమ ఎవరినైనా మారుస్తుందని రష్మిక తెలియజేశారు. ప్రేమించిన వారి కోసం మారడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అంటూ రష్మిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా రష్మిక మొదటిసారి ప్రేమ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో మరోసారి విజయ్ తో రిలేషన్ పై వార్తలు తెరపైకి వచ్చాయి..!!