ఛావా సినిమాకు ముందు రష్మిక మందన్న వరుసగా యానిమల్, పుష్ప 2 సినిమాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఈ మధ్య కాలంలో ఏ ఇండియన్ హీరోయిన్‌కి దక్కని భారీ విజయాలు, అత్యధిక వసూళ్లను రష్మిక నటించిన సినిమాలు దక్కించుకున్నాయి. అతి త్వరలోనే రష్మిక మందన్న సౌత్‌లో నటిస్తున్న ‘కుబేర’ సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాలో ధనుష్‌కి జోడీగా నటించడం ద్వారా కోలీవుడ్, టాలీవుడ్‌లోనూ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇన్ని భారీ సినిమాలు చేస్తున్న రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాను సైతం త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుంది. పాన్ ఇండియా రేంజ్‌లో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విడుదల కాబోతుంది. మొత్తానికి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాలతో క్వీన్‌గా రష్మిక దూసుకు పోతుంది. ఈ ఏడాదిలో రష్మిక మందన్న నుంచి రాబోతున్న సినిమాలు ఆమె స్థాయిని మరింతగా పెంచుతాయని అభిమానులు అంటున్నారు. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అన్ని చోట్ల రష్మిక క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా అనే గుర్తింపును సొంతం చేసుకుంది..!!