in

Rashmika Condemns AI Misuse for Vulgar Content Targeting Women!

AI టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన కంటెంట్‌ను సృష్టించడంపై సినీ నటి రష్మిక మందన్న తీవ్రంగా స్పందించారు. ఇటువంటి చర్యలు సమాజంలో కొందరి నైతిక పతనాన్ని సూచిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై తన అభిప్రాయాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. AI సాంకేతికతపై ఆమె స్పందిస్తూ.. “నిజాన్ని కూడా సృష్టించగలిగే ఈ కాలంలో, వివేచన మనకు గొప్ప రక్షణ. ఏఐ అనేది అభివృద్ధికి దోహదపడే ఒక శక్తి..

కానీ దానిని మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యతను సృష్టించడానికి వాడటం కొందరిలో లోతైన నైతిక పతనాన్ని చూపిస్తుంది” అని అన్నారు. “ఇంటర్నెట్ ఇకపై వాస్తవానికి అద్దం పట్టదు, అది దేన్నైనా సృష్టించగల ఒక కాన్వాస్‌గా మారింది. ఈ దుర్వినియోగాన్ని మనం అధిగమించాలి. గౌరవప్రదమైన సమాజ నిర్మాణానికి ఏఐని ఉపయోగించుకోవాలి. బాధ్యతగా మెలగడం నేర్చుకోవాలి. మనుషుల్లా ప్రవర్తించని వారికి కఠినమైన, క్షమించరాని శిక్షలు విధించాలి,” అని రష్మిక తన పోస్ట్‌లో పేర్కొన్నారు..!!

happy birthday renu desai!

Samantha’s Net Worth and luxury cars becomes a hot topic!